: గుంటూరు సభలో పవన్ అభిమానుల హల్ చల్
గుంటూరులో జరుగుతున్న ఎన్డీఏ బహిరంగ సభలో సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు హల్ చల్ చేశారు. పవన్ వేదిక వద్దకు వచ్చినప్పుడు అత్యుత్సాహంతో లోపలికి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని వెనక్కి నెట్టివేయడంతో బారికేడ్లు ధ్వంసం చేశారు. అటు పవన్ మాట్లాడుతున్నంత సేపు జనసేన జెండాలు చూపిస్తూ నినాదాలు చేశారు.