: టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియాకు ఐదో స్థానం
భారత్ క్రికెట్ జట్టు అత్యంత దుర్భర ప్రదర్శన తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ పై ప్రభావం చూపింది. దాంతో ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. ఇక ఇదే జాబితాలో ఆస్ట్రేలియా జట్టు టాప్ పొజిషన్ ను దక్కించుకుంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లో ఆడిన టెస్టుల్లో పలు మ్యాచులు కోల్పోయిన టీమిండియా మూడో స్థానం నుంచి ఐదుకు చేరింది. ఇక 2008 తర్వాత కంగారూ జట్టు తొలి స్థానానికి చేరడం విశేషం.