: కేసీఆర్ బూతులు తిడుతున్నా జగన్ నోరెత్తడం లేదు: పవన్ కల్యాణ్


పవన్ కల్యాణ్ గుంటూరు సభలో మాట్లాడుతూ... వైఎస్ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ తో ఉన్న అనుబంధమేమిటో జగన్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన విధానం సరిగా జరగలేదని, అది తనను బాగా బాధించిందని, అందుకే జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. కేసీఆర్ సీమాంద్రను పదే పదే తిడుతున్నా, జగన్ నోరెత్తడం లేదెందుకని పవన్ ప్రశ్నించారు. కేసీఆర్ బూతులు తిడుతున్నా, జగన్ ఈ విషయమై ఎందుకు మాట్లాడటం లేదని, జగన్ లో సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా? అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News