: రుణమాఫీ ఆంధ్ర, తెలంగాణకు రాహుల్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్: చిదంబరం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇటీవల హైదరాబాదు బహిరంగ సభలో ప్రకటించిన రైతు రుణమాఫీ ఆంధ్ర, తెలంగాణకు మాత్రమే పరిమితమని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. రెండు రాష్ట్రాల మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరిచామని ఆయన చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు రైతు రుణమాఫీ వర్తించదని చిదంబరం స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో జరిగిన సభలో రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం విదితమే.