: ఆముదాలవలసలో మద్యం సీసాలు స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని 13వ వార్డులో రెండువేల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. అవి వైఎస్సార్సీపీ నేతకు చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అటు చిత్తూరు జిల్లా జీడి, నెల్లూరు మండలం తూగండ్ర పొలంలో 2,700 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన వైఎస్సార్సీపీ కార్యకర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.