: సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు 2 వారాల గడువు : హైకోర్టు
ఇంకా సెట్ టాప్ బాక్స్ అమర్చుకోక టీవీ ప్రసారాలను మిస్ అవుతోన్న వీక్షకులకు ఊరట లభించింది. ఈ అంశం మీద హైకోర్టు ఇవాళ స్పందించింది. డిజిటలైజేషన్ కు సంబంధించి రెండు వారాలపాటు కేబుల్ ప్రసారాలకు ఆటంకం కలిగించవద్దని హైకోర్టు ఆదేశించింది. కాగా, హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో టీవీలకు సెట్ టాప్ బాక్స్ అమర్చుకోనివారికి మార్చి31 అర్థరాత్రితో కేబుల్ ప్రసారాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.