: కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్


కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ నోటి దురుసుతో ఎన్నికల కోడ్ ను మరోసారి ఉల్లంఘించారు. దీనిపై ఎన్నికల సంఘం మండిపడింది. ఇటీవల ఆయన కాన్పూర్ ర్యాలీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఆయనను అభిశంసించింది. ఈసీ పంపిన షోకాజ్ నోటీసుకు బేణీ ప్రసాద్ వర్మ ఇచ్చిన సమాధానంతో ఎన్నికల సంఘం ఏమాత్రం సంతృప్తి చెందలేదు. బేణీ ప్రసాద్ తప్పుచేశారని ఈసీ పేర్కొంది. ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఈసీ చెప్పడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇంతకు ముందు ‘ఆర్ఎస్ఎస్ లో అతిపెద్ద గూండా మోడీయే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News