: చెన్నై పేలుళ్లలో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన జయలలిత
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఇవాళ ఉదయం జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గుంటూరుకి చెందిన స్వాతి కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారాన్ని ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. అలాగే ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వారికి రూ. 50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 25 వేలు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రయాణికులెవరూ ఆందోళన చెందవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ జంట పేలుళ్ల ఘటనపై జయలలిత దర్యాప్తునకు ఆదేశించారు