: యూపీలో బిగ్ బీ చిత్రానికి పన్ను మినహాయింపు
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన తాజా చిత్రం 'భూత్ నాథ్ రిటర్న్స్'కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు నిన్న (బుధవారం) రాత్రి ఆ రాష్ట్ర ప్రిన్పిపల్ సెక్రెటరీ ప్రకటన విడుదల చేసినట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఈ సినిమాకు అత్యధిక స్థాయిలో వస్తున్న ఆదరణ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రవిచోప్రా, భూషన్ కుమార్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం యూపీలోని రెండొందల ప్రాంతాల్లో ప్రదర్శితమవుతోంది. ఓటు ప్రాముఖ్యత గురించి తెలిపే 'భూత్ నాథ్ రిటర్న్స్'ను మరింత మంది ప్రేక్షకులు చూస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తోంది.