: అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పోటీ పడాలి: దిగ్విజయ్ సింగ్


విడిపోయినప్పటికీ అభివృద్ధి విషయంలో సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కోరారు. పారిశ్రామిక రంగంలోనూ రెండు రాష్ట్రాలు అగ్రగామిగా నిలవాలని సూచించారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, యూపీఏ హయాంలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చామని చెప్పారు. ప్రజల మేలుకోసమే ఇందిరాగాంధీ అప్పట్లో బ్యాంకుల జాతీయకరణ చేశారని అన్నారు. మే 7, 12న జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ కే ఓటు వేయాలన్నారు.

ఇక తన సొంత విషయంపై మాట్లాడిన డిగ్గీరాజా, మోడీ మాదిరిగా తానేమి దాచిపెట్టలేదన్నారు. అమృతారాయ్ విడాకుల వ్యవహారం ముగిశాక పెళ్లి చేసుకుంటామని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News