: పోలింగ్ ముగిశాక కొత్త గ్యాస్ ధరలు
దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయిల్ మినిస్ట్రీ కొత్త గ్యాస్ ధరలు ప్రకటించనుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న అన్ని రకాల సిలిండర్లకు కొత్త ధరల సూత్రాన్ని అనుసరించి ధరను నిర్ణయిస్తున్నట్లు జనవరి 10న చెప్పగా, అదే నెల 17న గెజిట్ లో కేంద్రం ప్రకటించింది. అయితే, ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్దిష్ట రేటు అమల్లోకి వస్తుందని తెలపగా, పోలింగ్ ముగిసి ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే అమలు చేయాలని అప్పుడే ఎన్నికల కమిషన్ సూచించడంతో అది తాత్కాలికంగా నిలిచిపోయింది.