: హైదరాబాదు నగరాన్ని యూటీ చేయాలని మోడీని కోరాం: అశోక్ బాబు
హైదరాబాదు నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేయాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కోరినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఈరోజు ఉదయం తిరుమలలో అశోక్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నరేంద్ర మోడీ, చంద్రబాబులను కలిసి సీమాంధ్ర సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. తమ అభ్యర్థనలను విన్న మోడీ, చంద్రబాబు సానుకూలంగా స్పందించారని అశోక్ బాబు అన్నారు.