: ప్రియురాలితో జల్సాల కోసం 21 కార్లు కొట్టేశాడు
ముగ్గురు ప్రియురాళ్లతో జల్సాలు చేసేందుకు, వారు కోరిన ముచ్చట తీర్చేందుకు ఇటీవలే ఉత్తరప్రదేశ్ లో ఓ యువకుడు 9 బ్యాంకులకు కన్నం వేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాడే మరొకడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఢిల్లీలోని కీర్తినగర్ కు చెందిన రవిత్యాగి ప్రియురాలి కోసం ఏకంగా 21 కార్లు కొట్టేశాడు. ప్రియురాలిని లాంగ్ డ్రైవ్ కు తీసుకువెళ్లేందుకు అతడీ పని చేశాడు. ఇటీవలే తనిఖీల సందర్భంగా రవిత్యాగి కారులో వెళుతూ పోలీసుల కంటపడ్డాడు. రెజిస్ట్రేషన్ కాగితాలు అడిగితే చూపించలేకపోయాడు. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు బయటపెట్టాడు. అవి విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఎట్టకేలకు అతడు కొట్టేసిన కార్లను, ఓ బైక్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.