: అవినీతి, అసమర్థ కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టండి: చంద్రబాబు


తెలుగుదేశం అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఎన్డీయే బహిరంగ సభలో టీడీపీ అదినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అసమర్థ పార్టీ అని, గత పదేళ్లలో దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రోత్సహించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని చంద్రబాబు అన్నారు. దేశాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని బాబు పిలుపునిచ్చారు.

దేశానికి ఇప్పుడు సమర్థమైన నాయకత్వం అవసరమన్నారు. ఇప్పుడు టీడీపీ-బీజేపీ కూటమి చారిత్రక అవసరమని బాబు పునరుద్ఘాటించారు. తెలంగాణలో జగన్ బినామీ కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. అవినీతిని రూపుమాపి... దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే నరేంద్ర మోడీ వల్లే సాధ్యమని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు టీడీపీ-బీజేపీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు.

  • Loading...

More Telugu News