: ప్రొద్దుటూరులో జగన్ భార్య భారతి ప్రచారం ప్రారంభం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అధినేత జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి కూడా ఎన్నికల ప్రచారంలో దిగిపోయారు. ఇప్పటికే జగన్, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతి ఈ రోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు 135 నుంచి 140 శాసనసభ స్థానాలు సీమాంధ్రలో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు బద్వేల్, 3వ తేదీన కడప నియోజకవర్గాల పరిధిలో భారతి ప్రచారం కొనసాగనుంది.