: నేడు శ్రామికుల పండుగ
రెక్కాడితే గానీ డొక్కాడని కష్ట జీవులను స్మరించుకునే రోజు నేడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మికుల దినోత్సవం నేడు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటం చివరికి మే డే గా అవతరించింది. 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు రోజులో 8 గంటల పని పరిమితి కోసం సమ్మెకు దిగారు. అది హింసాత్మక రూపం దాల్చింది. పోలీసుల కాల్పులతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1904లో ఆమ్ స్టర్ డామ్ లో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో ఎనిమిది గంటల పని కోసం ఏటా మే 1న ఉద్యమించాలని నిర్ణయించారు. అదే చివరికి సాకారమై మే డే గా అవతరించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా సెలవు. మన దేశంలో తొలిసారిగా 1923లో చెన్నైలో మేడే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా నేడు కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.