: ములాయం వ్యాఖ్యలను తిప్పికొట్టిన మాయావతి
సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన వైవాహిక స్థితిపై చేసిన వ్యాఖ్యలను బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తిప్పికొట్టారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే ఆయన మానసికంగా బ్యాలెన్స్ తప్పారని మండిపడ్డారు. దయచేసి ములాయం కుటుంబం ఆయన్ను వెంటనే ఆగ్రాలోని మానసిక చికిత్సాశ్రమంలో చేర్చాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్నోలోని ఫైజాబాద్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ములాయం, 'నేను ఆమెను మిస్ లేక మిస్టర్, సిస్టర్' అని పిలవచ్చా? అంటూ మాయావతిపై వ్యంగ్యాస్త్రం వదిలారు.