: రంగంలోకి దిగనున్న జాతీయ దర్యాప్తు సంస్థ
జాతీయ దర్యాప్తు సంస్థ బృందం చెన్నై బాంబు పేలుళ్ల కేసు విచారణలో పాలు పంచుకోనుంది. ఈ ఉదయం చెన్నై రైల్వే స్టషన్లో ఆగి ఉన్న గౌహతి ఎక్స్ ప్రెస్ లో రెండు బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ఢిల్లీ నుంచి ఒక్కో ఎన్ఐఏ పోలీసుల బృందాన్ని చెన్నైకు పంపారు. దర్యాప్తులో సిట్ పోలీసులకు ఎన్ఐఏ అధికారులు సహకరిస్తారు.