: విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచారో చెప్పండి : హైకోర్టు
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ మీద ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఏ అంశాల ఆధారంగా స్లాబ్ వర్గీకరణ, ధర పెంపు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఈనెల 8న నివేదిక సమర్పించాలని విద్యుత్ నియంత్రణ సంస్థ, డిస్కం, ట్రాన్స్ కోను హైకోర్టు ఆదేశించింది.