: పేలుళ్లపై విచారణకు ఆదేశం: ఖర్గే
చెన్నై రైల్వే స్టేషన్లో బాంబు పేలుళ్ల ఘటన విచారకరమని రైల్వే శాఖ మంత్రి మల్లికార్జునఖర్గే అన్నారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబానికి లక్ష పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 25వేల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 5వేల రూపాయల చొప్పున పరిహారం అందివ్వనున్నట్లు చెప్పారు. ఉదయం రైలు స్టేషన్లోకి వచ్చిన 10 నిమిషాలకు బాంబు పేలుళ్లు జరిగినట్లు తెలిపారు.