: తెలుగు ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు : దాడి
రాష్ట్రానికి విద్యుత్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతోందని శాసనమండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. రాష్టంలో నెలకొన్న విద్యుత్ సమస్య మీద ఆయన ఈమేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇవాళ లేఖ రాశారు. తెలుగు ప్రజలను కేంద్రం ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తోందని లేఖలో దాడి ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీర్చేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆయన ప్రధానిని కోరారు.