: మొగుడ్ని చంపేశానని టీవీ స్టూడియోలో చెప్పేసింది!


ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడిని కడతేర్చింది. అతనిప్పుడు మరొక మహిళ మోజుల్లో పడ్డాడు. దీంతో కుతకుతలాడిపోయింది. ఎలాగైనా వాడిమీద కసి తీర్చుకోవాలనుకుంది. అంతే, చేసిన పాపం చెబితే పోతుందంటారు కదా, అందుకే తను చేసిన పాపాన్ని టీవీ స్టూడియో సాక్షిగా కక్కేసి ప్రియుడితో పాటు కటకటాలపాలయ్యింది. వివరాల్లోకెళితే... తమిళనాడులో బేబీకళ అనే మహిళ నాలుగేళ్ల క్రితం రాధాకృష్ణన్ అనే వ్యక్తిని వివాహమాడింది.

రాధా కృష్ణన్ తో కాపురం చేస్తుండగానే, బేబీకళ గౌరీశంకర్ అనే యువకుడి మోజులో పడింది. దీంతో భర్తను లేపేస్తే తమకు అడ్డం ఉండదని భావించిన బేబీకళ, గౌరీశంకర్ ఓ రోజు రాధాకృష్ణన్ కు బాగా మద్యం తాగించి, ప్లాస్టిగ్ బ్యాగ్ తో ఊపిరాడకుండా చేసి చంపేశారు. రాధాకృష్ణన్ గుండెపోటుతో చనిపోయాడని చుట్టుప్రక్కల వారిని, బంధువులను నమ్మించారు.

దీంతో రాధాకృష్ణన్ అంత్యక్రియలు సజావుగా జరిగి ఆ సంగతి మర్చిపోయారు. నాలుగేళ్లు సజావుగా సాగిన వీరి వ్యవహారం గౌరీశంకర్ ఇంకో అమ్మాయి వెంట పడటంతో అడ్డం తిరిగింది. దీంతో బేబీకళ భగ్గుమంది. కోపం పట్టలేక ఓ టీవీ స్టుడియోకి చేరుకుని ప్రియుడి మోజులో ఆమె చేసిన నిర్వాకాన్ని బయటపెట్టింది. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News