: రోజుకి 7గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తాం : రఘువీరా
రైతాంగానికి రోజుకు కచ్చితంగా ఏడుగంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి రఘువీరారెడ్డి తేల్చిచెప్పారు. రెండు పంటలకైనా మూడు పంటలకైనా సరే విద్యుత్ అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ మీద ఈఆర్సీ ఇచ్చిన ప్రతిపాదనలు బుట్టదాఖలు చేస్తామన్నారు.
ప్రస్తుతం విపక్షాలు విద్యుత్ అంశంమీద రాద్దాంతం చేస్తున్నాయనీ, దీనికి ప్రజల మద్దతులేదనీ అన్నారు. 2004 విద్యుత్ ఉద్యమంలో లక్షలాది ప్రజలు పాల్గొంటే ఇప్పుడు ఆయా పార్టీల నేతలే పాల్గొంటున్నారని రఘువీరా విశాఖపట్నంలో చెప్పుకొచ్చారు.