: కాంగ్రెస్, టీడీపీ ఘర్షణ...నామాకు గాయాలు
ఖమ్మం జిల్లా టీడీపీ నేత నామా నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. శంకరగిరి తండాలో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీ నామా నాగేశ్వరరావుకు స్వల్పగాయాలయ్యాయి.