: మోడీ సరైన వ్యక్తి కాదనుకుంటా: అమర్త్యసేన్
దేశ ప్రధాని పదవి అలంకరించేందుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సరైన వ్యక్తి కాదేమో అని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని బోల్పూర్ లోక్ సభ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీకి కొన్ని వర్గాల్లో విపరీతమైన ఆదరణ ఉందన్నది వాస్తమని అంగీకరిస్తూనే, వ్యాపార వర్గాల్లో ఆయనకు ఆదరణ ఎక్కువగా ఉందని అన్నారు.
అంతమాత్రాన ఆయనను ప్రధానిగా అంగీకరించమంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. మరింత లౌకికవాది అయి ఉండి, అల్పసంఖ్యాక వర్గాలైన ముస్లిం, క్రైస్తవులు నిర్భయంగా జీవించగలిగే ధైర్యాన్నివ్వగల నేత దేశ ప్రధాని అయితే బాగుంటుందని ఆయన తెలిపారు.