: బీజేపీ మాజీ అధ్యక్షుడ్ని క్షమాపణలు కోరిన కేంద్ర మంత్రి
కాంగ్రెస్ పార్టీతో పాటు, ఆ పార్టీ నేతలు కూడా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. దిగ్విజయ్ సింగ్ రెండో పెళ్లి దుమారం చల్లారకముందే, కేంద్రమంత్రి మనీష్ తివారీ ఇబ్బందుల్లో పడ్డారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి మనీష్ తివారీ క్షమాపణలు కోరారు. కార్గిల్ అమరవీరులకు మహారాష్ట్ర సర్కారు కేటాయించిన ఆదర్శ్ ఫ్లాట్లలో గడ్కరీకి కూడా ఫ్లాట్ ఉందంటూ మనీష్ తివారీ తీవ్ర వాఖ్యలు చేశారు. దీనిపై గడ్కరీ 2010లో పరువు నష్టం దావా వేశారు. కేసు వేగం పుంజుకున్న నేపథ్యంలో మనీష్ తివారీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అరెస్టు తప్పించుకునేందుకు మనీష్ తివారి గడ్కరీని క్షమాపణలు కోరారు.