: చంద్రబాబు ఓటు చెల్లదు: భన్వర్ లాల్


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓటును చెల్లని ఓటుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. జూబ్లిహిల్స్ లో చంద్రబాబునాయుడు ఓటు వేసిన తరువాత బీజేపీకి వేశానని తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలపై నివేదిక కోరిన భన్వర్ లాల్ ఆయన ఓటును చెల్లని ఓటుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్లు వేసినట్టు చెప్పినంత మాత్రాన ఓటు చెల్లదంటే, టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీడీపీకి ఓటు వేశామని చెబితే ప్రత్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News