: అవును, ఆమెను పెళ్లి చేసుకుంటాను: దిగ్విజయ్ సింగ్
వెనకటికి అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందట... అలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ డిగ్గీరాజ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరి వ్యక్తిగత జీవితాలమీద ఆరోపణలు, విమర్శలు చేయాల్సి వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే దిగ్విజయ్ సింగ్...మరో సంచలనానికి తెరతీశారు. సరిగ్గా ఎన్నికల సమయంలో, టీవీ యాంకర్ అమృతారాయ్ తో దిగ్విజయ్ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చి దుమారం రేపాయి.
ఇమేజ్ డ్యామేజి అవుతుందని గ్రహించిన దిగ్విజయ్ సింగ్ 'అవును, నిజమే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని అంగీకరించారు. అంతటితో ఆగకుండా 'ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నాక ఆమెను వివాహం చేసుకుంటా' అని నోరు జారారు. దీంతో ఆయనపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
వివాహితను అధికారం, డబ్బు ఎరచూపి తప్పుదోవ పట్టించాడని, ఆమె భర్త నుంచి విడదీసేందుకు పూనుకుంటున్నాడని, భార్య క్యాన్సర్ తో మరణించిన ఏడాదికే ఇంకో మహిళపై మోజుపడ్డాడని డిగ్గీరాజాని ఏకిపడేస్తున్నారు.