: పవన్ కల్యాణ్ పై జగనే కేసుపెట్టించాడు: యనమల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదు వెనుక జగన్ హస్తముందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ ప్రచారం చేస్తున్నాడనే అక్కసుతోనే జగన్ టీఆర్ఎస్ నేతలతో కేసు పెట్టించారని అన్నారు. సోనియా ఆదేశాలమేరకే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతాయని ఆయన చెప్పారు.