: ప్రేమికుల హృదయాలు గాయపర్చిన దియా మీర్జా!


మాజీ మిస్ ఏషియా పసిఫిక్, బాలీవుడ్ నటి దియామీర్జా అభిమాన ప్రేమికుల హృదయాలను గాయపరిచింది. మిస్ ఇండియాగా ఎన్నికైన దగ్గర్నుంచి ఎందరో యువకుల్ని తన అందచందాలతో కట్టిపడేసిన దియామీర్జా ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనుంది. సుదీర్ఘ కాలంగా తన వ్యాపార భాగస్వామిగా ఉన్న సాహిల్ సంగాతో ఆమె మూడు ముళ్లు వేయించుకోనున్నారు. న్యూయార్క్ నగరంలో సాహిల్ సంగాతో నిశ్చితార్థం జరిగినట్టు దియామీర్జా ట్విటర్లో తెలిపింది.

తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఒక ఫొటో కూడా ట్విట్టర్లో పోస్టు చేసింది. సికింద్రాబాద్ ఆలుగడ్డబావి ప్రాంతానికి చెందిన దియామీర్జా స్థానిక స్టాన్లీ కళాశాలలో చదవుకుంది. సాహిల్ సంగాతో 2011లో 'బోర్న్ ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్' అనే సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ 'లవ్ బ్రేకప్స్ జిందగీ', 'బాబీ జాసూస్' అనే సినిమాలను నిర్మించింది.

  • Loading...

More Telugu News