: రేవంత్ సమక్షంలో టీడీపీ, టీఆర్ఎస్ బాహాబాహీ
మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, టీఆర్ఎస్ వర్గాలు బాహాబాహీకి దిగి... రాళ్లు, కర్రలతో కొట్టుకున్నాయి. టీడీపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గుర్నాథరెడ్డి కుమారుడు ఒకేసారి పోలింగ్ బూత్ లోకి వచ్చిన సమయంలో... టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు.