: నా ఓటు తప్పేశావంటూ వృద్ధురాలు ఆందోళన
వయసులో పెద్దావిడ. ఈవీఎంపై ఓటేయడం తెలియదు. దాంతో అక్కడున్న అధికారి సాయం కోరింది. బాబ్బాబు కాస్త ఓటేసి పెట్టవూ అని అడిగింది. ఓటరు సాయం కోరితే తప్పకుండా చేయాలనే నిబంధన ఉంది. దాంతో ఆ అధికారి కూడా సరేనన్నారు. అయితే, ఆవిడ కాంగ్రెస్ కు ఓటేయాలని చెప్పగా... ఆ అధికారి టీఆర్ఎస్ పక్కన బటన్ పై ఓటేశారట. అంతే ఆ పెద్దావిడకు ఒళ్లు మండిపోయింది. ఎందుకిలా చేశావ్? అంటూ ఆ అధికారిని నిలదీసి గొడవకు దిగింది. కరీంనగర్ జిల్లా రాయకల్ మండల కేంద్రంలోని 25వ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.