: రాములమ్మకు మండింది...పోలింగ్ అధికారిని దూషించింది
మెదక్ జిల్లా ముత్తాయి కోటలో కాంగ్రెస్ నేత విజయశాంతి హల్ చల్ చేశారు. టీఆర్ఎస్ కు పోలింగ్ అధికారి మద్దతు పలుకుతున్నారంటూ రాములమ్మ మండిపడ్డారు. "నీ పని ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? ఒక పార్టీని వెనకేసుకొస్తావా?" అంటూ విజయశాంతి పోలింగ్ అధికారిపై దూషణకు దిగారు. దీంతో పోలింగ్ సిబ్బంది ఆమెను సముదాయించారు.