: భార్య, పిల్లలు కనిపించడంలేదని సినీ నిర్మాత ఫిర్యాదు
సినీ నిర్మాత నందకిషోర్ ఇవాళ హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. తన భార్య నీరజ, ఇద్దరుపిల్లలు..ప్రేమ్ సత్య యాదవ్, పునీత్ యాదవ్ కనిపించడం లేదని ఆయన పీఎస్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటున్న నందకిషోర్ మార్చి 23 నుంచి తన భార్యా పిల్లలు కనిపించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.