: ఓట్లెందుకు తొలగించారంటూ ఓటర్ల ఆందోళన... లాఠీఛార్జ్
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఓటర్లు ఆందోళనకు దిగారు. తమకు గుర్తింపు కార్డులున్నప్పటికీ ఓటర్ల లిస్టులో పేర్లు ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ తో ఆందోళనకారులను చెదరగొట్టారు.