: విద్యుత్ సమస్యపై టీడీపీ సంతకాల ఉద్యమం


రాష్ట్రంలో విద్యుత్ సమస్యమీద తెలుగుదేశం పార్టీ ఇవాళ సంతకాల ఉద్యమం చేపట్టింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఆరోపించారు. 

2004 లో  మంచి పనితీరుకుగాను ఏపీ ట్రాన్స్ కో  అవార్డు అందుకుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ వ్యవస్థ అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి డబ్బులు లెక్కపెట్టుకుంటే, ఇప్పుడు కిరణ్ ఎమ్మెల్యేలను లెక్కపెట్టుకుంటున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.        

  • Loading...

More Telugu News