: ఓటేసే వారిని అభినందించాలి: రాజశేఖర్


సినీ నటుడు రాజశేఖర్, అతని భార్య జీవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన, ఓటు వేసిన వారిని అభినందించాలని తెలిపారు. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉందని, విద్యావంతులే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సాకులు వెతుకుతున్నారని ఆయన అన్నారు. అది మంచిపద్దతి కాదని ఆయన సూచించారు. సాయంత్రంలోపు ఓటు వేసి తమ బాధ్యత నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News