: కష్టాల్లో ఉన్నా నంబర్ 3 మనదే
భారత్ 2005లో ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ 2011కు వచ్చేసరికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జపాన్ ను వెనక్కి నెట్టేసి మరీ భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. జపాన్, బ్రిటన్ తమ స్థానాలను దిగజార్చుకున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ తమ స్థానాలను కొద్దిగా మెరుగుపరచుకోగా, ఇటలీ ఎప్పటివలే అదే స్థానంలో కొనసాగుతున్నట్లు ఇంటర్నేషనల్ కంపేరిజన్ ప్రొగ్రామ్ వెల్లడించింది. ప్రపంచంలో మొత్తం ఆర్థిక శక్తిలో మూడింట రెండొంతులు 12 దేశాల చేతుల్లోనే ఉండడం విశేషం.