: ఓటేయడానికి దుబాయ్ నుంచి వచ్చిన పుజారా


ఓటు హక్కు ఎంత విలువైనదో తన చర్య ద్వారా క్రికెటర్ చటేశ్వర్ పుజారా నిరూపించారు. దుబాయ్ లో ఐపీఎల్ పోటీల్లో ఆడుతున్న పుజారా కేవలం ఓటు వేసేందుకు స్వదేశానికి వచ్చారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈ రోజు పుజారా ఓటు వేసి, వెంటనే దుబాయ్ కు తిరిగి వెళ్లిపోనున్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో పుజారాను ప్రచార కర్తగా ఎన్నికల సంఘం వినియోగించుకున్న విషయం తెలిసిందే, ఓటు వేసేందుకు దుబాయ్ నుంచి పుజారా రావడం ఇతర ఓటర్లకు స్పూర్తినిస్తుందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News