: రోడ్డేయరా?... అయితే మేము ఓట్లేయం!


ఆ గ్రామంలో ఓటర్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గత 60 ఏళ్లుగా తాము అనుభవిస్తున్న దారిద్ర్యానికి రాజకీయనాయకులను నిందించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిసినా... తమకు మరో దారి లేక పోలింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామానికి కనీసం రహదారి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడుతూ, తమను ప్రభుత్వాలు బహిష్కరించినప్పుడు తాము ఓటు వేసి ఎందుకు ఎన్నుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కూచారం తాండలో చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News