: రాహుల్ వాహనాన్ని ఢీ కొన్న రైలు
రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటన కోసం సిద్ధం చేసిన వాహనాన్ని రైలు ఢీ కొనడంతో అది నుజ్జునుజ్జైంది. హిందూపురంలో ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న రాహుల్ గాంధీ కాన్వాయ్ లో జామర్ల కోసం ఈ వాహనాన్ని పోలీసులు సిద్ధం చేశారు. హిందూపురం సమీపంలోని గుడ్డం వద్ద కాపలాలేని రైల్వే క్రాసింగ్ ను దాటుతున్న సమయంలో జామర్ వాహనాన్ని యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. రైలు రాకను గమనించిన భద్రతా సిబ్బంది ప్రక్కకు దూకేశారు. డ్రైవర్ అప్రమత్తమయ్యేలోగానే వాహనాన్ని రైలు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను హిందూపురం ఆసుపత్రికి తరలించారు.