: కరెంట్ ఉండదు.. బిల్లులు మాత్రం వస్తుంటాయ్ : విజయమ్మ
కరెంట్ బిల్లులు రెట్టింపు పెంచేస్తే సామాన్య ప్రజలు ఎలా చెల్లించగలరని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సర్కారుని ప్రశ్నించారు. ప్రజల కష్టాలను భరించాల్సింది ప్రభుత్వమేనన్నారు. ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోన్న సర్కారుకు చంద్రబాబు మద్దతివ్వకుంటే ఈ ప్రభుత్వం ఉండేదా..? అని ఆమె టీడీపీని సూటిగా ప్రశ్నించారు. ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న అనంతరం విజయమ్మ తొలిసారి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.