: తెలంగాణలో పోలింగ్ ప్రారంభం
తెలంగాణలోని 17 లోక్ సభ, 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 17 లోక్ సభ స్థానాలకు 265 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, 119 అసెంబ్లీ స్థానాలకు 1669 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 30,518 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,81,74,055 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,43,88,933 పురుషులు, 1,37,82,790 మహిళలు ఉన్నారు. ఎన్నికల బరిలో కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగరరావు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితర ప్రముఖులు ఉన్నారు.