: వీర్య కణాల నాణ్యతను తెలుసుకోవాలనుకుంటున్నారా?
వీర్య కణాలను పరీక్షించుకునేందుకు ఓ కిట్ ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. చాలా మంది సెర్మ్ కౌంట్ కోసం ల్యాబ్ కు వెళ్లాలంటేనే బిడియంగా ఫీలవుతారు. అలాంటి వారి కోసమే ఈ కిట్ ను తయారుచేశామని పరిశోధకులు తెలిపారు. ఈ కిట్ తో ఇంట్లోనే వీర్యాన్ని పరీక్షించవచ్చని వాషింగ్టన్ లోని సాండియా లేబరేటరీ శాస్త్రవేత్తలు తెలిపారు.
వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉంటే సంతానం కలిగే అవకాశాలు కూడా తక్కువవుతాయనే సంగతి తెలిసిందే. ఈ సరికొత్త కిట్ తో సంతానలేమితో బాధపడేవారు వీర్య కణాల నాణ్యతను ఇంట్లోనే పరీక్షించుకునే వీలుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ట్రాక్ ఫెర్టిలిటీగా వ్యవహరించే ఈ కిట్ లో వీర్య కణాల నాణ్యతను చాలా సులభంగా తెలుసుకోవచ్చునని వారంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కిట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.