: బాక్సర్ విజేందర్ సింగ్ పై పోలీసుల కొత్త పిటిషన్!


మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాక్సర్ విజేందర్ సింగ్ నుంచి రక్త నమూనాలు, కేశాలు సేకరించేందుకు అనుమతి కోసం పంజాబ్ పోలీసులు కోర్టులో తాజా పిటిషన్ ను వేయనున్నారని తెలుస్తోంది. కొన్ని నెలల కిందట విజేందర్ 12 హెరాయిన్ సీసాలు ఉపయోగించాడని పోలీసులు ఆరోపిస్తున్న సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో తమకు అతన్ని పరీక్షించి నిరూపించే హక్కు ఉందని పోలీసులు వాదించనున్నారు. 
ఇదిలావుంటే, సాంకేతిక కారణం చూపి విజేందర్ ను పరీక్షించాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిన్న చేసిన అభ్యర్ధనను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ తిరస్కరించింది. 

  • Loading...

More Telugu News