: పాతబస్తీలోని ధూల్ పేటలో మద్యం పొంగి పొర్లుతోంది!
హైదరాబాదు పాతబస్తీలోని ధూల్ పేటలో మద్యం వాసన గుప్పుమంటోంది. ఒకప్పుడు గుడుంబా స్థావరంగా పేరొందిన ధూల్ పేటలో ఎన్నికల నేపథ్యంలో మద్యం పొంగి పొర్లుతోంది. ఎక్సైజ్ పోలీసులు ధూల్ పేటలో దాడులు నిర్వహించి 1900 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులైన పలువురిని అరెస్ట్ చేశారు.