: తెలుగుదేశంపై సీపీఎం నేత బృందా కారత్ ఫైర్
తెలుగుదేశం పార్టీపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మండిపడ్డారు. విశాఖపట్నంలోని గాజువాకలో సీపీఎం పార్టీ అభ్యర్థి నర్సింగరావు తరపున ఆమె ఇవాళ ప్రచారం నిర్వహించారు. టీడీపీ-బీజేపీ కూటమిపై ఆమె విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయని కారత్ అన్నారు. ఈ రెండు పార్టీలు ఎన్నికల ప్రణాళికలను ఒకదానికొకటి కాపీ కొట్టాయని ఆమె విమర్శించారు.