: పాతబస్తీలో పర్యటించిన అనురాగ్ శర్మ
సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన పాతబస్తీలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఈ రోజు పర్యటించారు. రేపు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన చార్మినార్ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కమిషనర్ వెంట పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా వున్నారు.