: ఓటు వేసేటప్పుడు సెల్ ఫోనును తీసుకువెళ్లవద్దు!


ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లక పోవడమే మంచిది. పోలింగ్ కేంద్రాలలో సెల్ ఫోన్లను అనుమతించబోమని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ఓటర్లు పోలింగ్ బూత్ లకు సెల్ ఫోన్లను తీసుకురావద్దని వారు విజ్ఞప్తి చేశారు.

ఇటీవల బెంగళూరులో జరిగిన ఎన్నికలలో చాలామంది అలవాటు ప్రకారం పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లను తీసుకువెళ్లడంతో పోలింగ్ సిబ్బంది వారిని లోపలికి అనుమతించకపోవడంతో చాలా మంది ఓటేయకుండానే వెనుదిరిగారు. బెంగళూరు సిటీలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి ఈ అంశం కూడా ఓ కారణమయ్యింది.

  • Loading...

More Telugu News