: మే 1న భీమవరంలో మోడీ, బాబు, పవన్ భారీ సభ


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మే 1న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తెలిపారు. భీమవరంలో ఆయన మాట్లాడుతూ, ఈ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో 2 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News